కాంగ్రెస్ కీలక నేతపై #మీటూ మరకలు

Update: 2018-10-16 10:41 GMT

దేశవ్యాప్తంగా #మీటూ ఉద్యమం ఉదృతమవుతోంది. వివిధ రంగాల్లోని మహిళలు ఎదుర్కొన్న లైంగిక వేదింపులను #మీటూ ద్వారా బహిర్గతం చేస్తున్నారు. ఇప్పటికే #మీటూ ఆరోపణలు పలు రంగాల ప్రముఖులకు చుట్టుకున్నాయి. ఇప్పుడు తాజాగా రాజకీయాల్లోనూ ఈ ఆరోపణలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్ఎస్ యూఐ జాతీయ అధ్యక్షుడు ఫిరోజ్ ఖాన్ తనను లైంగికంగా వేదించాడని చత్తీస్ గఢ్ కు చెందిన ఓ మహిళా కార్యకర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఫిరోజ్ ఖాన్ వెంటనే తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాహుల్ గాంధీ ఆమోదించి ఫిరోజ్ ఖాన్ పై పార్టీపరంగా విచారణ జరిపించేందుకు మూగ్గురు సభ్యులతో కమిటీ వేశారు.

Similar News