బ్రేకింగ్ : మధ్యప్రదేశ్ లో ‘‘మాయా’’ సర్కార్

Update: 2018-12-12 06:43 GMT

మధ్యప్రదేశ్ లో మ్యాజిక్ ఫిగర్ ఒక్క సీటులో భారత జాతీయ కాంగ్రెస్ ఆగిపోయింది. దీంతో ఇతరుల సహకారం అవసరమైంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మద్య పోరు హోరా హోరీ సాగింది. నువ్వా? నేనా? అన్నట్లు చివర వరకూ ఉత్కంఠనెలకొంది. ఫైనల్ రిజల్ట్ లో కాంగ్రెస్ కు 114 స్థానాలు లభించాయి. 230 స్థానాలున్న మధ్యప్రదేశ్ లో అధికారంలోకి రావాలంటే మ్యాజిక్ ఫిగర్ 115. అయితే ఒక్క నెంబరు తగ్గింది. మరోవైపు బీజేపీకి 109 స్థానాలు వచ్చాయి. ఇతరులకు ఐదు స్థానాలు లభించాయి.

మాయావతి ఓకే అనడంతో....

రెండు స్థానాలు దక్కించుకున్న మాbయావతి బహుజన్ సమాజ్ పార్టీ ఇక్కడ కీలకంగా మారింది. అయితే ఎన్నికలకు ముందు దిగ్విజయ్ మాయావతికి వ్యతిరేకంగా చేసిన కామెంట్లతో కాంగ్రెస్ పార్టీ మాయావతి తమతో కలసి వస్తారో? లేదో? అన్న టెన్షన్ పెట్టుకుంది. ఎన్నికలకు ముందే బీఎస్పీ, కాంగ్రెస్ పొత్తు కుదరాల్సి ఉన్నా అది సాధ్యం కాలేదు. కానీ మ్యాజిక్ ఫిగర్ కు ఒక్క స్థానం తక్కువ కావడంతో మాయావతి కాంగ్రెస్ కు సహకరించడానికి అంగీకరించారు. దీంతో కాసేపట్లో మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేతలు గవర్నర్ ను కలవబోతున్నారు.

Similar News