టీడీపీ నేతలకు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్

తన తండ్రి మోహన్ బాబుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన విమర్శలకు హీరో మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా బుద్దా వ్యాఖ్యలపై [more]

Update: 2019-04-02 07:44 GMT

తన తండ్రి మోహన్ బాబుపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న చేసిన విమర్శలకు హీరో మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్ వేదికగా బుద్దా వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. ‘‘వెంకన్న గారు నోరు ఉంది కదా అని ఊరికే పారేసుకోకండి.. ఎలెక్షన్స్ ఉండేది ఇంకో పది రోజులే. తర్వాత మీరు మా ఇంటికి రావాలి. మేము మీ ఇంటికి రావాలి. ఒకళ్లనొకళ్లు ముఖాలు చూసుకోవాలి’’ అని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఒకరినొకరు విమర్శించుకోవచ్చని కానీ సభ్యత ఉండాలని విష్ణు అన్నారు. అన్నింటికీ హద్దు ఉంటుందని, నెల రోజుల క్రితం తిరుపతిలో తమ ఇంటికి వచ్చి ఏం మాట్లాడారో మర్చిపోవద్దని పేర్కొన్నారు.

Tags:    

Similar News