అశ్లీల చిత్రాల ప్రభావం...ఆరేళ్ల బాలుడిపై..

Update: 2018-06-26 13:21 GMT

ఆశ్లీల చిత్రాల ప్రభావంతొ ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతోందని, లైంగిక వేదింపులు పెరిగిపోయాయని చూస్తూనే ఉన్నాం. ఈ ఘటన చూస్తే ఆడపిల్లలే కాదు, మగ పిల్లలకు కూడా భద్రత లేదనిపిస్తోంది. పోర్నోగ్రఫీ ప్రభావంతో నెల్లూరులో ఓ ఆరేళ్ల బాలుడిపై మరో ఇద్దరు బాలురు రెండు నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. మార్కెటింగ్ ఎగ్జిగ్యూటీవ్ గా పనిచేస్తున్న ఓ వ్యక్తికి ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడికి ఆరేళ్ల వయస్సు. చాలా చురుగ్గా ఉంటాడు. తండ్రి డ్యూటీకి వెళ్లేటప్పుడు గేటు వరకు వచ్చి టా..టా.. చెబుతాడు. వచ్చేటప్పుడు తండ్రికి ఎదురుగా వెళ్లి తాను ఆ రోజంతా ఏమి చేసాడో సంతోషంగా చెబుతాడు. అటువంటి బాలుడు గత రెండు నెలలుగా ఉన్నట్లుండి మారిపోయాడు.

కుమారుడిలో మార్పు చూసి.....

తల్లిదండ్రులపై చిరాకు పడుతున్నాడు. ఏమైనా అంటే అన్నం ప్లేట్ పడేస్తున్నాడు. దీంతో తన కుమారుడిలో వచ్చిన మార్పుపై తండ్రికి అనుమానం వచ్చింది. ఏమి జరిగిందని ఎంత అడిగినా బాలుడు చెప్పలేదు. ఓ రోజు బాలుడిని దగ్గరకు తీసుకుని, ‘తాను నీ స్నేహితుడి లాంటి వాడినని, ఏమి జరిగిందో నాతో చెప్పు’ అని నచ్చజెప్పడంతో బాలుడు జరిగింది చెప్పాడు. కింది అంతస్తులో ఉండే బంధువుల కుమారులు ఆడుకుందామని పిలిచి ఇలా చేశారని చెప్పాడు. వారి వయస్సు ఒకరికి 15 ఏళ్లు, మరొకరికి 17 ఏళ్లు. దీంతో కుమారుడు చెప్పింది వీడియో తీసిన తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. దీంతో పోలీసులు ఇద్దరు బాలురలను జువైనల్ హోంకి తరలించారు. అయితే బాలురు ఇలాంటివి చేయడం సహజమేనని, ఇందుకు పోలీస్ కేసు ఎందుకని ఘటనకు పాల్పడ్డ వారి నానమ్మ, విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిని ప్రశ్నించడం గమనార్హం.

Similar News