శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక నిర్ణయం

మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడి తల్లిదండ్రులు మరణిస్తే వారి పిల్లలకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకుంది. వారు అనాధలు కాకుండా ఆ [more]

Update: 2021-05-14 00:37 GMT

మధ్యప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కరోనా బారిన పడి తల్లిదండ్రులు మరణిస్తే వారి పిల్లలకు అండగా నిలబడాలని నిర్ణయం తీసుకుంది. వారు అనాధలు కాకుండా ఆ పిల్లలకు పింఛనుతో పాటు ఉచిత విద్య, రేషన్ అందివ్వాలని మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే అనేక మంది పిల్లలు అనాధలుగా మారిపోయారు. వారిని ప్రభుత్వ హాస్టళ్లలో చేర్పించాలని, వారు ఎదిగే వరకూ వారి భవిష్యత్ ను తామే తీసుకుంటామని మధ్యప్రదేశ్ ప్రభుత్వం చెబుతోంది. ఈ నిర్ణయానికి దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

Tags:    

Similar News