ఎల్వీ బదిలీకి కారణం అదేనా?

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీకి కారణం ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను థిక్కరించడమేనంటున్నారు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ [more]

Update: 2019-11-04 13:41 GMT

ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఆకస్మిక బదిలీకి కారణం ముఖ్యమంత్రి జగన్ ఆదేశాలను థిక్కరించడమేనంటున్నారు. ఉగాది నాటికి 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని జగన్ నిర్ణయించారు. అయితే ఇటీవల జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో జగన్ కలెక్టర్లతో ఇళ్ల స్థలాల కోసం భూసేకరణ జరపాలని కోరారు. అయితే పక్కనే ఉన్న ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ స్థలాలను ఇంటి స్థలాలకు ఇస్తే శ్మశానవాటికలకు స్థలం దొరకదని వ్యాఖ్యానించారు. కలెక్టర్ల ఎదుటే తన ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఎల్వీ చేసిన వ్యాఖ్యలపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వీడియో కాన్ఫరెన్స్ నుంచి వెళ్లిపోయారట. అంతేకాకుండా తాను ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ సీఎం ఇస్తున్న ఆదేశాలను కూడా ఎల్వీ పట్టించుకోకపోవడంతోనే బదిలీ వేటు పడిందంటున్నారు.

Tags:    

Similar News