వీడి బిల్డప్ చూడండి.. అందరూ పడిపోయారు

ఫేస్‌బుక్ తో ఎలా బుక్‌ చేయొచ్చో తెలుసుకున్నాడు…పక్కా స్కెచ్‌ వేసాడు…అంతా అనుకున్నట్టే జరిగిపోతోంది..ఇంత పెద్ద ఆఫీసర్‌ మనకు తెలుసని ఎవరికి వారు సంబరపడిపోయారు. షాప్‌ ఓపెనింగ్‌లకు చీఫ్‌ [more]

Update: 2020-09-30 03:23 GMT

ఫేస్‌బుక్ తో ఎలా బుక్‌ చేయొచ్చో తెలుసుకున్నాడు…పక్కా స్కెచ్‌ వేసాడు…అంతా అనుకున్నట్టే జరిగిపోతోంది..ఇంత పెద్ద ఆఫీసర్‌ మనకు తెలుసని ఎవరికి వారు సంబరపడిపోయారు. షాప్‌ ఓపెనింగ్‌లకు చీఫ్‌ గెస్ట్‌గా ఇన్వైట్‌ చేసారు..అతగాడి ఠీవీ , గెటప్‌ చూస్తే…ఎవరైనా సెల్యూట్‌ చేయాల్సిందే.. అచ్చంగా ఆర్మీ అధికారిగా కనిపించే ..ఈ కేటుగాడు…ఒరిజినల్‌ కాదు నకిలీ అని తెలుసుకుని అంతా నోరెళ్లబెట్టారు .

డ్రస్ మెడల్స్ చూసి….

ఒంటిపై ఆర్మీ కల్నల్‌ డ్రెస్‌…చేతిలో తుపాకీ..పక్కనే ఉన్న మరొకరి చేతిలో హాండ్‌కప్స్‌…ఇవన్నీ చూస్తే..పెద్ద ఆర్మీ అదికారి అనుకోక తప్పదు..ఇక.. అతని ఆర్మీ డ్రెస్‌కున్న అవార్డులు చూస్తే…ఒక్క భారతరత్న , పరమవీరచక్ర మినహా అన్నీ కనిపిస్తాయి . అటువంటి వ్యక్తి ఎదురుపడి…నీ తండ్రికి టెర్రరిస్టులతో సంబందాలున్నాయని ఎవరినైనా బెదిరిస్తే…పై ప్రాణాలు పైనే పోతాయి . సైబరాబాద్‌లో నిజంగానే ఇలాంటి ఘటనే జరిగింది. బట్‌…ఆర్మీ డ్రెస్‌ , ఐడీ కార్డ్ , తుపాకులు అన్నీ ఫేక్‌..ఈ గ్యాంగ్‌ లీలలు చూసిన పోలీసులే షాకయ్యారు.

షాప్ ఓపెనింగ్ కూడా….

పశ్చిమగోదావరి జిల్లా కొమ్ముచిక్కల గ్రామానికి చెందిన నాగరాజు రఘు అలియాస్‌ కార్తీక్‌ అలియాస్‌ కల్నల్‌ కార్తికేయసింగ్‌ ఫేస్‌బుక్‌ చూస్తే…దేశంలో అత్యంత అరుదైన ఆర్మీ అధికారిగా కనిపిస్తారు . హైదరాబాద్‌లోని ఓ ఆయుర్వేదిక్‌ షాపు వాళ్లు..కల్నల్‌ కార్తికేయసింగ్‌ ఫేస్‌బుక్‌ చూసి…వారి షాప్‌ ప్రారంభోత్సవానికి పిలుచుకున్నారు . ఆర్మీ అధికారి గెటప్‌లో…డ్రైస్‌పై మెడల్స్‌తో చీఫ్‌గెస్ట్‌గా వచ్చి..షాప్‌ ఓపెన్‌ చేసాడు . ఆర్మీ అదికారి తమ షాప్‌ ఓపెన్‌ చేసాడని సంబరపడిపోయిన ఆ షాపు నిర్వాహకులకు… సైబరాబాద్‌ పోలీసులు ఇచ్చిన సమాచారంతో మైండ్‌బ్లాంక్‌ అయింది.

కిడ్నాప్ చేసి ..డబ్బులు దండుకుని….

హైదరాబాద్‌లో పలు నేరాలతో సంబందం ఉన్న..ఇతగాడు..ఈజీ మనీ అర్నింగ్‌కోసం మరో ముగ్గురుతో కలిసి ఓ గ్యాంగ్‌ ఫామ్‌ చేసాడు..ఎవరినైనా బెదిరించి..కిడ్నాప్‌ ప్లాన్‌ చేస్తే బాగా డబ్బులు రాబట్టొచ్చని ప్లాన్‌ చేసాడు . అందుకు ఒక నకిలీ ఆర్మీ అధికారిగా ఐడీ కార్డ్‌ క్రియేట్‌ చేసుకున్నాడు…ఆ కార్డును చూపి..సికిందరాబాద్‌లోని షాప్‌లలో ఆర్మీ డ్రెస్‌..హాండ్‌కప్స్‌..షాప్‌లో లబించిన అన్ని మెడల్స్‌ను కొనుగోలు చేసాడు . ఐడీ కార్డు చూసిన షాపు వారు కూడా…ఇతగాడు అడిగినవన్నీ అమ్మారు..ఇంకేముందీ..రామచంద్రాపురం పీయస్‌ లిమిట్స్‌లో…ఓ వ్యక్తిని రౌండప్‌ చేసి..తన ముగ్గురు సభ్యుల గ్యాంగ్‌తో కిడ్నాప్‌ చేసాడు . కరెంట్‌షాక్‌ ఇచ్చే మిషన్‌తో పాటు తన దగ్గర ఉన్న నకిలీ తుపాకులతో బెదిరించి…నీ తండ్రికి టెర్రరిస్టులతో సంబందాలు ఉన్నాయంటూ బెదిరించారు . అతగాడి ఎటీయం కార్డుతో పాటు కారును కూడా లాగేసుకున్నారు . ఏటీయంలో ఉన్న 25 వేల రూపాయలను డ్రా చేసుకున్నారు . అనుమానం వచ్చిన బాదితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో…రంగంలోకి దిగిన సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌ పోలీసులు…కార్తికేయను అదుపులోకి తీసుకుని విచారిస్తే…ఆర్మీ అదికారి పేరుతో చేస్తున్న మోసాలు అన్నీ బైటపడ్డాయి . ఆర్మీలో ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ బాదితుల నుంచి ఆరులక్షలకు పైగా కార్తికేయ అలియాస్‌ రఘువర్మ వసూలు చేసినట్టు కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది . తన సొంతూరు లో జనాలను నమ్మించేందుకు ఏకంగా …ఆర్మీ అదికారి గెటప్‌లో ఉన్న కటౌట్స్‌ను కూడా వేయించుకున్నాడు..మనోడు ఆర్మీలో ఆఫీసర్‌ అని నమ్మిన వారంతా..ఎంతో కొంత సమర్పించుకున్నారని పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లో బైటపడింది .ఆర్మీ అదికారిగా చలామణి అవుతూ…మోసాలకు పాల్పడుతున్న ఇతగాడి బాగోతం బైటపడటంతో…బాదితులు పోలీస్‌స్టేషన్‌కు క్యూ కడుతున్నారు .

Tags:    

Similar News