‘మీ నాన్న మాటలు విను’

Update: 2018-07-02 08:14 GMT

‘‘తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది అమ్మ కాదు...బొమ్మ కాదు... పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం’’ అని కేటీఆర్ సోనియా గాంధీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివదాస్పదమవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఈ వ్యాఖ్యలపై తీవ్రంగా దుమ్మత్తి పోస్తుండగా, తాజాగా ట్విట్టర్ వేదికగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి కేటీఆర్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘సోనియా గాంధీ వల్లే తెలంగాణ కల సాకారం అయ్యిందని, ఈ విషయాన్ని కాదన్న వారు మూర్ఖులే’’ అని గతంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యల వీడియోను ట్విట్టర్ లో షేర్ చేశారు. సోనియా గాంధీ గురించి అసెంబ్లీలో మీ నాన్న చెప్పిన మాటలు విను అని ఉత్తమ్ కేటీఆర్ ను ఉద్దెశించి ట్వీట్ చేశారు.

Similar News