దేవినేని పై కొడాలి మళ్లీ ఫైర్

దేవినేని ఉమ డ్రామాలాడుతున్నారని, అందుకే ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు దిగే యత్నం చేశారని మంత్రి కొడాలి నాని అన్నారు. తాను దేవినేని ఉమకు సవాల్ విసిరిన [more]

Update: 2021-01-19 06:12 GMT

దేవినేని ఉమ డ్రామాలాడుతున్నారని, అందుకే ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు దిగే యత్నం చేశారని మంత్రి కొడాలి నాని అన్నారు. తాను దేవినేని ఉమకు సవాల్ విసిరిన మాట వాస్తవమేనన్నారు. అయితే నాలుగు గోడల మధ్య కాని, టీవీ ఛానళ్లలో చర్చకు కూర్చుందామని తాను చెప్పానని, రోడ్ల మీద చర్చకు కూర్చుంటే ఎక్కడైనా పోలీసులు అనుమతిస్తారా? అని కొడాలి నాని ప్రశ్నించారు. పోలీసులు అనుమతించరనే దేవినేని ఉమ ఈ డ్రామాలాడారన్నారు. టీడీపీ మ్యానిఫేస్టో, వైసీపీ మ్యానిఫేస్టో అమలుపై చర్చకు తాను ఎప్పటికీ సిద్ధమేనని కొడాలి నాని చెప్పారు. దేవినేని ఉమ ఇప్పటికైనా డ్రామాలు మానుకోవాలని ఆయన కోరారు. రోడ్డు మీద చర్చ జరపడానికి ఇవేనా కోడిపందాలా? అని అన్నారు. దేవినేని ఉమ తనను పోలీసులు హౌస్ అరెస్ట్ చేస్తారని తెలిసే ఈ డ్రామాకు తెరతీశారన్నారు.

Tags:    

Similar News