ఈసారి ఖైరతాబాద్ గణేషుడు

గత ఏడాది 65 అడుగులతో ద్వాదశాదిత్య మహా గణపతిగా పూజలు అందుకున్నాడు ఖైరతాబాద్ గణేషుడు. కాగా ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సారి 27 అడుగులకే ఖైరతాబాద్ [more]

Update: 2020-07-03 08:32 GMT

గత ఏడాది 65 అడుగులతో ద్వాదశాదిత్య మహా గణపతిగా పూజలు అందుకున్నాడు ఖైరతాబాద్ గణేషుడు. కాగా ప్రస్తుతం కరోనా కారణంగా ఈ సారి 27 అడుగులకే ఖైరతాబాద్ గణేషుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ విజృంభణ మామూలుగా లేదు. అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పెద్ద ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో చాలా మంది ప్రజలు ఈ వైరస్ భయంతో నగరం నుండి పల్లెలకు తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారీ రూపాన్ని తగ్గించుకున్నాడు ఖైరతాబాద్ వినాయకుడు.

పూర్తిగా మట్టితోనే…

ఈ ఏడాది 27 అడుగులకే ఖైరతాబాద్ గణేషుడు పరిమితం కానున్నాడు. గత ఏడాదితో పోల్చితే 38 అడుగులు తగ్గింది విగ్రహ ఆకారం. గత ఏడాది 65 అడుగులతో ద్వాదశాదిత్య మహా గణపతిగా పూజలు అందుకున్నాడు. 27 అడుగులే కనుక పూర్తి మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయాలని ఖైరతాబాద్ గణేష్ కమిటీ నిర్ణయం తీసుకుంది. 27 అడుగులతో ధన్వంతరి వినాయకుడిని ఏర్పాటు చేయనుంది ఖైరతాబాద్ వినాయక ఉత్సవ కమిటీ. భౌతిక దూరం పాటిస్తూ దర్శనాలు ఏర్పాటు చేస్తామంటున్నారు నిర్వాహకులు. అలాగే ఆన్‌లైన్ ద్వారా కూడా దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు ఖైరతాబాద్ గణేష్ కమిటీ నిర్వాహకులు వెల్లడించారు.

Tags:    

Similar News