కేసీఆర్ ఆధ్వర్యంలో కీలక సమావేశం

Update: 2018-10-16 10:17 GMT

ప్రజలను ఆకట్టుకునేలా మేనిఫెస్టోను సిద్ధం చేస్తోంది టీఆర్ఎస్. ఇప్పటికే ఆ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్ కె.కేశవరావు ఆధ్వర్యంలో మేనిఫెస్టో రూపొందించేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్నారు. వివిధ సంఘాల నుంచి వచ్చిన వినతులు, సలహాలను కూడా కమిటీ తీసుకుని మేనిఫెస్టోలో చేర్చింది. గత ఎన్నికల్లో బంగారు తెలంగాణ పేరుతో టీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రజలను ఆకట్టుకున్నట్లుగానే ఈసారి కూడా రూపొందించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఇవాళ తెలంగాణ భవన్ లో ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో మేనిఫెస్టో కమిటీ కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి పలువురు మంత్రులు కూడా హాజరయ్యారు. ముఖ్యంగా పింఛన్ల పెంపు, నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్రూం స్కీంలో మార్పు వంటి అంశాలపై మేనిఫెస్టో కమిటీ ప్రధానంగా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. కమిటీ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ మేనిఫెస్టో లోని కీలక అంశాలను ప్రకటించే అవకాశం ఉంది.

Similar News