కేసీఆర్ కొత్త నినాదం

Update: 2018-09-07 12:45 GMT

‘‘తెలంగాణ స్వతంత్ర్యంగా ఉండాలి... సామంతులుగా కాదు’’, ‘‘ఢిల్లీకి గులాములుగా కాదు... తెలంగాణ గులాబీలుగా ఉందాం’’అని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ నినాదం ఇచ్చారు. శుక్రవారం ఆయన హుస్నాబాద్ లో ఎన్నికల శంఖారావన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... టీఆర్ఎస్ పాలనలో 21.96 శాతం అభివృద్ధితో తెలంగాణ దేశంలోనే అగ్రపధాన ఉందని పేర్కొన్నారు. నోరు, కడుపు కట్టుకుని అవినీతిరహితంగా పాలన చేస్తేనే ఇది సాధ్యమైందన్నారు. టీఆర్ఎస్ వచ్చేనాటికి ఖాళిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ ఫర్మార్లు ఉండేవని, ఇవాళ దేశంలో వ్యవసాయం కోసం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తన్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అని పేర్కొన్నారు.

దరిద్రపు గొట్టు పాలనతో....

కాంగ్రెస్ దరిద్రపుగొట్టు పాలన వల్లనే దేశం మొత్తం దరిద్రంతో ఉందని విమర్శించారు. కాంగ్రెస్ అసమర్ధ విధానాల వల్లే దేశం వెనకబడిందని ఆరోపించారు. ఏరంగంలో చూసినా అంతులేని పేదరికానికి కారణం కాంగ్రెస్ మాత్రమే అన్నారు. సమైక్య పాలన వల్ల ఏర్పడ్డ దరిద్రాన్ని పారద్రోలేందుకు టీఆర్ఎస్ నాలుగేళ్లుగా ప్రయత్నించిందన్నారు. మళ్లీ టీఆర్ఎస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు

Similar News