రాజీ ప్రసక్తి లేదు.. ఇక పోరాటమే

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరిని అవలంబించైనా ప్రయోజనాలు సాధించుకుంటామని చెప్పారు. కేసీఆర్ [more]

Update: 2020-09-11 02:44 GMT

రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరిని అవలంబించైనా ప్రయోజనాలు సాధించుకుంటామని చెప్పారు. కేసీఆర్ టీఆర్ఎస్ ఎంపీలతో సమావేశమయ్యారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. జీఎస్టీ పరిహారం విషయంలో రాజీపడవద్దని, ఆందోళనలకు దిగాలని కేసీఆర్ ఎంపీలను ఆదేశించారు. ఇతర పార్టీల సహకారం తీసుకుని కేంద్రం ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని కోరారు. ఇప్పటి వరకూ కేంద్రానికి సహకరిస్తూ వస్తున్నామని, జీఎస్టీ, విద్యుత్ సంస్కరణల విషయంలో కేంద్రానికి తలొగ్గే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు.

Tags:    

Similar News