వాళ్లూ... తాజ్ లోనే....!

Update: 2018-05-18 10:27 GMT

రేపు బలపరీక్ష అని సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో పార్టీలు తమ వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఈ మేరకు భారతీయ జనతా పార్టీ నేతలు శుక్రవారం బెంగళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ హోటల్ అత్యవసరంగా సమావేశమై బీజేపీ నేతలు రేపు అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలు చేస్తున్నారు. బలపరీక్షకు సమయం తక్కువ ఉన్నందున గట్టెక్కేందుకు ఏం చేయాలనే విషయమై చర్చిస్తున్నారు. ఈ బేటీలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ప్రకాశ్ జవడేకర్, మురళీధరరావు, జేపీ నడ్డా, శ్రీరాములు, తదితర నేతలు ఉన్నారు.

విమానం నిరాకరణ...

ఇక మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ మరింత చురుగ్గా ఆలోచనలు చేస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ చేరిన ఆ పార్టీ ఎమ్మెల్యేతో సమావేశం కావాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఇవాళ సాయంత్రం తాజ్ కృష్ణ హోటల్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య హాజరై రేపు ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై మార్గనిర్దేశం చేయనున్నారు. కాగా, హైదరాబాద్ వచ్చేందుకు బెంగళూరు ఎయిర్ పోర్టుకు వచ్చిన సిద్ధరామయ్య ప్రయణించే విమానానికి అనుమతి లభించలేదని నిలిపివేశారు. దీంతో ఆయన ఎయర్ పోర్టులోని నిరీక్షిస్తున్నారు.

Similar News