జస్టిస్ చలమేశ్వర్ కు ఇష్టంలేదా?

Update: 2018-05-09 13:59 GMT

సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర్ వీడ్కోలు సభకు రానని చెప్పేశారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు పదవీ విరమణ చేస్తున్నప్పుడు సంప్రదాయంగా సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వీడ్కోలు సభను నిర్వహిస్తుంది. ఈ వీడ్కోలు సభకు రావాల్సిందిగా చలమేశ్వర్ ను ఆహ్వానించగా ఆయన తిరస్కరించారు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వికాస్ సింగ్ ధృవీకరించారు. తనకు అలాంటి సభల్లో పాల్గొనే అలవాటు లేదని చలమేశ్వర్ సున్నితంగా తిరస్కరించారన్నారు. అయినా మరోసారి వీడ్కోలు సభకు రావాలని బార్ అసోసియేషన్ చలమేశ్వర్ ను కోరుతుందని ఆయన చెప్పారు. అయితే ఆయన అకస్మాత్తుగా సెలవుపై వెళ్లిపోయారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఆయన సీనియర్ గా ఉన్నారు. ఈ ఏడాది జూన్ 22న చలమేశ్వర్ పదవీ విరమణ చేయనున్నారు. గతంలోనూ సుప్రీంకోర్టులో జరుగుతున్న సంఘటనలపై జాస్తి చలమేశ్వర్ బహిరంగంగా మీడియా సమావేశం పెట్టిన సంగతి తెలిసిందే.

Similar News