Jaggareddy : కాంగ్రెస్ రేవంత్ జాగీరు కాదు… జగ్గారెడ్డి ఫైర్

తెలంగాణ కాంగ్రెస్ విభేదాలు తీవ్రమయ్యాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. చర్చ లేకుండానే రెండు [more]

Update: 2021-09-24 04:56 GMT

తెలంగాణ కాంగ్రెస్ విభేదాలు తీవ్రమయ్యాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఫైరయ్యారు. కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుందని జగ్గారెడ్డి ప్రశ్నించారు. చర్చ లేకుండానే రెండు నెలల కార్యాచరణ ఎలా ప్రకటిస్తారని ఆయన నిలదీశారు. జహీరాబాద్ లో గీతారెడ్డికి, సంగారెడ్డిలో తనకు అక్కడి కార్యక్రమాల గురించి సమాచారం ఇవ్వరా? అని ప్రశ్నించారు. ఇదేం ప్రొటోకాల్ ఆయన అసహనం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీయా ఇది ప్రయివేటు లిమిటెడ్ కంపెనీయా అని జగ్గారెడ్డి ఫైరయ్యారు. తనతో విభేదాలున్నాయని రేవంత్ రెడ్డి స్పష్టం చేయదలచుకున్నట్లుందని జగ్గారెడ్డి అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ లో ఒక్కరో హీరో కాలేరన్నారు. శాసనసభ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ ముఖ్యనేతల ఎదుట జగ్గారెడ్డి ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది.

Tags:    

Similar News