బ్రేకింగ్ : జేసీకి జగన్ ఝలక్

అనంతపురం జిల్లా యాడికి లోని మెస్సర్స్ త్రిశూల్ సిమెంట్ కంపెనీకి ఇచ్చిన లీజును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డికి చెందిన త్రిసూల్ [more]

Update: 2020-01-31 12:35 GMT

అనంతపురం జిల్లా యాడికి లోని మెస్సర్స్ త్రిశూల్ సిమెంట్ కంపెనీకి ఇచ్చిన లీజును ఏపీ ప్రభుత్వం రద్దు చేసింది. మాజీ ఎంపీ జేసీ దివాకరరెడ్డికి చెందిన త్రిసూల్ సిమెంట్ కంపెనీ యాడికి లోని కొనుప్పలపాడులో ఉన్న సర్వే నెంబరు 22 బిలో ఉన్న 649.86 హెక్టార్ల పరిధిలోని సున్నపు రాతి గనుల లీజుకు గత ప్రభుత్వం ఇచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి మరో ఐదేళ్ల పొడిగింపు ఇస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్ని కూడా వెనక్కు తీసుకుంది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటి వరకూ ఎలాంటి ముందడుగు పడనందునే లీజు రద్దు ఉత్తర్వులు జారీ చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది. లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపు రాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వితీయటం, రవాణా చేయటంపై విచారణ కొనసాగుతుందని ప్రభుత్వం పేర్కొంది.

Tags:    

Similar News