బ్రేకింగ్ : జగన్ సంచలన నిర్ణయం…అమరావతి ప్రాంతంలో?

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఆర్డీఏ పరిధిలోని అసైన్డ్ భూములపై థర్డ్ పార్టీ కొనుగోళ్లను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ రాజధాని [more]

Update: 2019-12-11 13:16 GMT

ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఆర్డీఏ పరిధిలోని అసైన్డ్ భూములపై థర్డ్ పార్టీ కొనుగోళ్లను రద్దు చేస్తూ ఏపీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఏపీ రాజధాని ప్రాంతంలో ఎక్కువ మంది థర్డ్ పార్టీ కొనుగోళ్ల ద్వారా లబ్ది పొందారని ప్రభుత్వం అనుమానిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఎక్కువ భూములు థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ ద్వారా కీలక వ్యక్తులు లబ్ది పొందారని భావిస్తుంది. అసైన్డ్ భూములు దళితులకు చెందినవి కావడంతో వారికి తిరిగి దక్కే విధంగా నిర్ణయం తీసుకుంది. ల్యాండ్ పూలింగ్ లబ్ది దళిత రైతులు పొందే అవకాశముంది. దీంతో పాటు కాపురిజర్వేషన్ల ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను ఎత్తివేసింది. అలాగే భోగాపురం ఎయిర్ పోర్టుకు ఆందోళన చేసిన వారిపై పెట్టిన కేసులను కూడా తొలగించింది. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా పరిగణిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రజా రావాణా శాఖ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.

Tags:    

Similar News