"పవర్" ఈసారి పెద్ద కష్టమేమీ కాదట

తెలంగాణలో కాంగ్రెస్ కు మంచి రోజులు ఉన్నట్లే కన్పిస్తుంది. స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ లో ఉత్సాహం కనపడుతుంది.

Update: 2022-01-29 02:34 GMT

తెలంగాణలో కాంగ్రెస్ కు వచ్చే ఎన్నికల్లో మంచి రోజులు ఉన్నట్లే కన్పిస్తుంది. ఇప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న కాంగ్రెస్ పార్టీలో కొంత ఉత్సాహం కనపడుతుంది. తెలంగాణలో బీజేపీ బలపడే అవకాశాలు లేవు. అది కేవలం కొన్ని నియోజకవర్గాలకే పరిమితం అయిన పార్టీ అది. అంతేకాదు కేంద్ర ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత కూడా ఆ పార్టీకి రాజకీయంగా ఇబ్బందికరంగా మారనుంది. కొన్ని వర్గాలు బీజేపీని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాయి. ధరలు, పెట్రోలు పెరుగుదలతో ఆ పార్టీ పట్ల పేద, మధ్య తరగతి ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారు.

బీజేపీకి అనుకున్నంత....
రైతులు కూడా బీజేపీ పట్ల సముఖంగా లేరు. దీంతో బీజేపీకి ప్రధాన వర్గాలు మద్దతిచ్చే అవకాశాలు కన్పించడం లేదు. మరోవైపు అధికార పార్టీపై అసంతృప్తి అనేది ఖచ్చితంగా ఉంది. రెండు పర్యాయాలు అధికారంలో ఉండటంతో సహజంగా తలెత్తే అసంతృప్తి విపక్షాలకు అనుకూలంగా మారుతుంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్ వైపు ఎక్కువ శాతం మంది ప్రజలు మొగ్గు చూపుతారన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి.
బలమైన క్యాడర్ తో...
కాంగ్రెస్ పార్టీకి 119 నియోజకవర్గాల్లో బలమైన నేతలతో పాటు క్యాడర్, ఓటు బ్యాంకు ఉంది. గత ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ కు వందకు పైగా నియోజకవర్గాల్లో పోటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయే. బీజేపీ ఎక్కడా లేదు. ఉదాహరణకు ఖమ్మం జిల్లాను చూసుకుంటే అక్కడ బీజేపీకి అవకాశమే లేదు. కాంగ్రెస్ కు ఈసారి ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాలను గెలుచుకునే అవకాశాలున్నాయన్నది వాస్తవం. అలాగే నల్లగొండ జిల్లాలోనూ అదే పరిస్థితి. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ ను ఈసారి ప్రజలు ఛాన్స్ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు.
కలసి పనిచేస్తే....
స్థానిక ఎమ్మెల్యేలపై ఉన్న అసంతృప్తి కూడా కాంగ్రెస్ కు వరంగా మారనుంది. అయితే కాంగ్రెస్ నేతలు తమపై ప్రజల్లో నమ్మకం కలిగించాలి. తాము ఓట్లు వేేసి గెలిపించుకున్నా పార్టీ మారరన్న విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించాలి. ఎన్నికలు దగ్గర పడే కొద్దీ కాంగ్రెస్ లో చేరికలు కూడా పెద్ద సంఖ్యలో ఉండే అవకాశముంది. ప్రధానంగా రేవంత్ రెడ్డి పీీసీపీ చీఫ్ అయిన తర్వాత కొంత కాంగ్రెస్ లో చురుకుదనం వచ్చిన మాట వాస్తవమే. కాంగ్రెస్ నేతలు ఐక్యతగా ఉండి కలసి పనిచేస్తే ఈసారి ఎన్నికల్లో అధికారానికి రావడం పెద్ద కష్టమేమీ కాదు.


Tags:    

Similar News