మేఘ కృష్ణారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు

మేఘా ఇంజనీరింగ్ కంపెనీ డైరెక్టర్ కృష్ణారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఐటీ రిటర్న్స్‌పై ఆ శాఖ అధికారులు దృష్టి [more]

Update: 2019-10-11 06:24 GMT

మేఘా ఇంజనీరింగ్ కంపెనీ డైరెక్టర్ కృష్ణారెడ్డి నివాసంలో ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించి ఐటీ రిటర్న్స్‌పై ఆ శాఖ అధికారులు దృష్టి పెట్టారు. ఏకకాలంలో మేఘా కృష్ణారెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలను ఐటీ అధికారులు ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 30 చోట్ల హైదరాబాద్‌లో నాలుగు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. బాలానగర్‌, జూబ్లీహిల్స్ చెక్ పోస్టులోని కార్యాలయం, ఎంసీహెచ్‌ ఆర్డీ సమీపంలోని ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి.

 

 

Tags:    

Similar News