బ్రేకింగ్ : తెలంగాణలో ఈరోజు 27 కేసులు మొత్తం 970 కేసులు

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం కొంత తగ్గుముఖం పట్టింది. ఈరోజు 27 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 970కు [more]

Update: 2020-04-23 13:00 GMT

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరగడం కొంత తగ్గుముఖం పట్టింది. ఈరోజు 27 కేసులు మాత్రమే నమోదయ్యాయి. దీంతో తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 970కు చేరుకుంది. ఇప్పటి వరకూ తెలంగాణలో కరోనా కారణంగా 25 మంది మృతి చెందారు. దేశంలో పెరుగుతున్న కేసులు, మరణాల సంఖ్యతో పోలిస్తే తెలంగాణలో కొంత బెటర్ గా ఉందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నాలుగైదు రోజుల్లో కరోనా కేసులు మరింత తగ్గుముఖం పట్టే అవకాశాలున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు.కొత్తగా నమోదయిన 27 కేసుల్లో 13 కేసులు హైదరాబాద్ లోనివే. తెలంగాణలో ప్రస్తుతం 693 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నట్లు ఈటల రాజేందర్ తెలిపారు.

Tags:    

Similar News