యుద్ధం వద్దు… కూర్చొని మాట్లాడుకుందాం: ఇమ్రాన్

ఇండియా – పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి వచనాలు వల్లిస్తున్నారు. శాంతియుత వాతావరణంలో కూర్చొని మాట్లాకుందామని ఆయన చర్చలకు [more]

Update: 2019-02-27 10:38 GMT

ఇండియా – పాకిస్తాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకుంటున్న వేళ పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి వచనాలు వల్లిస్తున్నారు. శాంతియుత వాతావరణంలో కూర్చొని మాట్లాకుందామని ఆయన చర్చలకు ప్రతిపాదించారు. సహనం కొల్పోయి యుద్ధం ప్రారంభమైతే పరిస్థితులు తన చేతిలో కానీ పాకిస్తాన్ చేతిలో కానీ ఉండవన్నారు. యుద్ధం అంటూ వస్తే రెండు దేశాలకూ మంచిది కాదు. గతంలో జరిగిన యుద్ధాలు ఎంటి నష్టం మిగిల్చాయో చూశామని పేర్కొన్నారు. చర్చల ద్వారా మాత్రమే పరిస్థితి అదుపులోకి వస్తుందని పేర్కొన్నారు. ఉగ్రవాదం అంతానికి ఏం చేయాలో చెప్పండి అని అన్నారు. పుల్వామా ఘటనపై ఆధారాలు ఇవ్వాలని పలుమార్లు భారత్ ను ఇప్పటికే కోరామని గుర్తు చేశారు. ఆదారాలు చూపిస్తే చర్యలు తీసుకుంటామన్నారు.

Tags:    

Similar News