చలో ట్యాంక్ బండ్ కు నో

చలో టాంక్ బండ్ ప్రోగ్రాంకి పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు ఉదయం చలో టాంక్ బండ్ నిర్వహించనునట్లు ఆర్టీసీ అఖిలపక్ష నేతలు ప్రకటించారు. దీని నిరాకరిస్తున్నట్లు గా [more]

Update: 2019-11-08 10:46 GMT

చలో టాంక్ బండ్ ప్రోగ్రాంకి పోలీసులు అనుమతి నిరాకరించారు. రేపు ఉదయం చలో టాంక్ బండ్ నిర్వహించనునట్లు ఆర్టీసీ అఖిలపక్ష నేతలు ప్రకటించారు. దీని నిరాకరిస్తున్నట్లు గా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వెల్లడించారు. అంతేకాకుండా టాంక్ బండ్ వైపు ఎవరు వచ్చినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. సామూహిక దీక్ష ట్యాంకుబండ్ పై నిర్వహించడానికి ఒక రోజు ముందుగానే పోలీస్ కమిషనర్ వద్ద పర్మిషన్ కోసం దరఖాస్తు చేశారు. ఈ విషయంపై అఖిలపక్ష నేతలు చలో ట్యాంక్ బండ్ కి అనుమతి ఇవ్వాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తామని తెలియజేశారు. అయితే దీన్ని అనుమతించే ప్రసక్తే లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ వెల్లడించారు. అంతేకాకుండా ఎవరైనా అటువైపు వస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు . పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా తాము చలో టాంక్ బండ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు. పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్ట్ లు చేసే అవకాశముంది.

Tags:    

Similar News