హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ చేయాల్సిందేనా?

హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ చేయాల్సిన పరిస్థిితి ఏర్పడింది. ఒక్కరోజులోనే వెయ్యి కేసులు తెలంగాణాలో నమోదయ్యాయయి. ఇందులో 888 మంది హైదరాబాద్ పరిధిలోని వారే. దీంతో [more]

Update: 2020-06-28 02:44 GMT

హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ చేయాల్సిన పరిస్థిితి ఏర్పడింది. ఒక్కరోజులోనే వెయ్యి కేసులు తెలంగాణాలో నమోదయ్యాయయి. ఇందులో 888 మంది హైదరాబాద్ పరిధిలోని వారే. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 13,436కు చేరుకుంది. మరణించిన వారి సంఖ్య 243కు చేరుకుంది. లాక్ డౌన్ మినహాయిపుల తర్వాత ప్రధానంగా హైదరాబాద్ లో కేసుల సంఖ్య పెరుగుతుంది. మొత్తం కేసుల్లో 80 శాతం హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఇప్పటికే వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. ఇదే క్రమంలో కేసుల సంఖ్య పెరుగుతుంటే హైదరాబాద్ లో మరోసారి లాక్ డౌన్ విధించక తప్పదంటున్నారు. లాక్ డౌన్ ప్రకటించి కఠినంగా నిబంధనలు అమలు చేయకుంటే కేసులు కంట్రోల్ కావని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags:    

Similar News