కేరళకు అరబ్ దేశం భూరి విరాళం

Update: 2018-08-21 07:57 GMT

వరదలతో కకావికలమైన కేరళ రాష్ట్రానికి అరబ్ దేశం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ) భారీ విరాళాన్ని ప్రకటించింది. కేరళను ఆదుకునేందుకు రూ.700 కోట్లు సాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయ్ మంగళవారం ప్రకటించారు. ఈ మేరకు అబుదాబీ యువరాజు మన ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్ మాట్లాడినట్లు ఆయన తెలిపారు. ఇటీవల ఆ దేశ ఉపాధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ కేరళ వరదలపై ట్వీట్ చేస్తూ...‘యూఏఈ విజయంలో కేరళ ప్రజల పాత్ర ఎంతో ఉంది. వారిని తప్పకుండా ఆదుకుంటాం’ అని పేర్కొన్నారు. అందుకు తగ్గట్లుగానే ఆ దేశం భారీ విరాళాన్ని ప్రకటించి ఉదారతను చాటుకుంది.

Similar News