నేటితో తేలనున్న గెహ్లాత్ భవితవ్యం

రాజస్థాన్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై నేడు హైకోర్టు తీర్పు కీలకంగా మారనుంది. సచిన్ పైలట్ వర్గంపై అనర్హత వేటు వేయాలని అశోక్ గెహ్లాట్ నిర్ణయించారు. ఈ [more]

Update: 2020-07-24 04:52 GMT

రాజస్థాన్ లో నెలకొన్న రాజకీయ అనిశ్చితిపై నేడు హైకోర్టు తీర్పు కీలకంగా మారనుంది. సచిన్ పైలట్ వర్గంపై అనర్హత వేటు వేయాలని అశోక్ గెహ్లాట్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ వర్గం రాజస్థాన్ హైకోర్టును ఆశ్రయించింది. నేటి వరకూ అనర్హత వేటు వేయకూడదని హైకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఈరోజు జరిగే విచారణ తర్వాత తీర్పు రానుంది. సచిన్ పైలట్ వర్గానికి అనుకూలంగా తీర్పు వస్తే అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి ముప్పే. అదే పైలట్ వర్గానికి వ్యతిరరేకంగా తీర్పు వస్తే గెహ్లాట్ ప్రభుత్వం ముప్పు నుంచి తప్పించుకున్నట్లే. స్వతంత్ర సభ్యుల మద్దతుతో గెహ్లాట్ ప్రభుత్వం కొనసాగించే వీలుంది.

Tags:    

Similar News