అగ్రిగోల్డ్ వ్యవహారంపై హైకోర్టు ఆగ్రహం ఎందుకంటే?

అగ్రిగోల్డ్ కేసులో బాధితులకు న్యాయం జరగకపోవడంపై కర్ణాటక హై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధితులకు న్యాయం చేయడంలో తీవ్ర జాప్యం జరగడంపై హైకోర్టు తప్పు పట్టింది. [more]

Update: 2020-03-02 07:18 GMT

అగ్రిగోల్డ్ కేసులో బాధితులకు న్యాయం జరగకపోవడంపై కర్ణాటక హై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధితులకు న్యాయం చేయడంలో తీవ్ర జాప్యం జరగడంపై హైకోర్టు తప్పు పట్టింది. కర్ణాటకలో 10లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితులున్నారు. వీరి నుంచి 1700 కోట్లకు పైగా డిపాజిట్ల వసూలు చేశారు. ఇప్పటి వరకూ అగ్రిగోల్డ్ స్థిరాస్తులు స్వాధీనం చేసుకోక పోవడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. అగ్రిగోల్డ్ పై ఫిర్యాదులు ఆన్ లైన్ లో స్వీకరిస్తున్నామని, ఇప్పటికి 8.62లక్షల ఫిర్యాదులు అందాయని పోలీసుల అఫిడవిట్ లో పేర్కొన్నారు. అయితే
ఆస్తుల స్వాధీనం చేసుకుని వేలం ప్రక్రియ నిర్వహించడానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని హై కోర్టు సూచించింది. స్థిరాస్తులు గుర్తించి కర్ణాటక డిపాజిటర్ల పరిరక్షణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించేలా చర్యలు చేపట్టాలని హై కోర్టు ప్రధాన న్యాయ మూర్తి ఆదేశించారు.

Tags:    

Similar News