బ్రేకింగ్ : ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. చాలా చోట్ల ఆక్సిజన్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో జరుగుతున్న ర్యాపిడ్ టెస్ట్ లపైనా హైకోర్టు [more]

Update: 2020-08-13 08:53 GMT

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ అయింది. చాలా చోట్ల ఆక్సిజన్ లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. రాష్ట్రంలో జరుగుతున్న ర్యాపిడ్ టెస్ట్ లపైనా హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ర్యాపిడ్ టెస్ట్ లు ఏ మేరకు సక్సెస్ అయ్యాయో ఇంత వరకూ ప్రభుత్వం చెప్పలేదని హైకోర్టు వ్యాఖ్యానించింది. అనేక చోట్ల ఆక్సిజన్ కొరత ఉందని, ఏం చేస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. ప్రయివేటు ఆసుపత్రుల్లో అధిక సంఖ్యలో ఫీజు వసూలు చేస్తున్నా ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. అయితే విచారణకు హాజరైన తెలంగాణ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తాము ఇప్పటికే 30 మందికి నోటీసులు జారీ చేశామని చెప్పారు. హైకోర్టు ఆదేశాలను ఏమాత్రం అమలు చేయడం లేదని హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.

Tags:    

Similar News