పదో తరగతి పరీక్షలకు గ్రీన్ సిగ్నల్

పదవ తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటి వారం నుంచి పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం హైకోర్టు అనుమతి కోరింది. ఈ మేరకు ప్రభుత్వం [more]

Update: 2020-05-19 08:30 GMT

పదవ తరగతి పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జూన్ మొదటి వారం నుంచి పరీక్ష నిర్వహించేందుకు ప్రభుత్వం హైకోర్టు అనుమతి కోరింది. ఈ మేరకు ప్రభుత్వం వేసిన ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని గతంలో ప్రభుత్వం అఫిడవిట్ లో పేర్కొంది. ప్రభుత్వం ధాఖలు చేసిన అఫిడవిట్ పై నేడు హైకోర్టు విచారణ చేసింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించింది. విద్యార్థుల భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని పరీక్షల నిర్వహణకు అనుమతివ్వాలని అఫిడవిట్ లో ప్రభుత్వం పేర్కొంది. వైద్యుల సలహా మేరకు కరోనా నివారణ చర్యలు చేపడతామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
పరిక్ష కేంద్రాలను పెంచి అన్ని విధాలుగా చర్యలు చేయాడుతామన్న ప్రభుత్వం తెలిపింది. దీంతో జూన్ మొదటి వారం తర్వాత పదవ తరగతి పరీక్షలు నిర్వహించుకోవడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చని హై కోర్ట్ చెపింది. జూన్ మూడో తేదీన పరిస్థితి సమీక్షించి నాలుగో తేదీన రిపోర్ట్ ఇవ్వాలని ప్రభుత్వానికి హై కోర్టు ఆదేశం జారీ చేసింది. అప్పటికి కేసులు ఎక్కువ సంఖ్యలో ఉంటే పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పింది.

Tags:    

Similar News