ఛీటర్లలోకి ఛీటర్ హీరా....!!!

Update: 2018-10-24 13:21 GMT

దేశ‌వ్యాప్తంగా డిపాజిట్ల‌ను వ‌సూల్ చేసి పోలీసుల‌కు చిక్కిన హీరా గోల్డ్ అధినేత్రి నౌహీరా షేక్ కేసులో దూకుడు పెంచారు పోలీసులు. రిమాండ్ లో ఉన్న హీరా ను 10 రోజుల పాటు త‌మ క‌స్ట‌డీలోకి అనుమతి ఇవ్వాలంటూ నాంప‌ల్లి కోర్టు లో క‌స్ట‌డీ పిటీష‌న్ దాఖ‌లు చేశారు. మ‌రో వైపు త‌న‌కు బెయిల్ మంజూరు చేయాలంటు నౌహీరా బెయిల్ పీటీష‌న్ దాఖ‌లు చేసింది. విచార‌ణ‌ జరిపినకోర్టు త‌దుప‌రి విచార‌ణ రేపటికి వాయిదా వేసింది.అయితే హీరా గోల్డ్ స్కాం 900 కోట్లకు చేరిందని పోలీసులు చెబుతున్నారు. మొత్తం 15 కంపెనీల ద్వారా ఈ మొత్తాన్ని డిపాజిట్ల రూపంలో సేకరించినట్లు చెబుతున్నారు.

డిపాజిట్లు సేకరించి....

వివిధ స్కీముల పేరుతో వేల మంది నుంచి డిపాజిట్లు సేకరించి మోసం చేశారనే రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక చోట్ల నౌహీరా పై అనేక కేసులు నమోదు అయ్యాయి. ఈ నేపధ్యంలో గతంలో సిసిఎస్ పోలీసులు ఢీల్లీ లో ఆమెను అదుపులోకి తీసుకుని అక్కడ కోర్టులో ప్రవేశ పెట్టి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా నౌహీరా షేక్ ను హైదరాబాద్ తీసుకు వచ్చారు. నౌహీరా ను నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టినగా ఆమెకు 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్ కు చంచల్ గూడ జైలుకు తరలించింది కోర్టు. అనంతరం ఆమెను 10 రోజుల పాటు కస్టడీ కి అనుమతి ఇవ్వాలని కోరుతూ కస్టడీ పిటిషన్ ధాఖలు చేశారు...హీరా గ్రూప్ అధినేత ను కస్టడీకి అనుమతి ఇస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ తమ వాదనలను వినిపించారు..తమ క్లయింట్ పై ఉద్దేశ్య పూర్వకంగానే కక్ష్య గట్టి కేసులు నమోదు చేశారని పోలీసుల కస్టడీకి అనుమతి ఇవ్వకుండా నౌహీరా కు బెయిల్ మంజూరు చేయాలని హీరా గ్రూప్ తరుపు న్యాయవాది కోర్టును కోరారు..ఇరువాదనలను విన్న కోర్టు తీర్పు ను రేపటికి వాయిదా వేసింది.

160 బ్యాంకు ఖాతాలు....

కోర్టులో హీరా గ్రూప్ తరపున వాదనలు వినిపించారు.. సుప్రీం కోర్టు న్యాయవాది తదాని. 2012 నుండి తమ క్లయింట్ గ్రూప్ లపై ఈ డి దర్యాప్తు చేస్తుందని తెలిపారు..ఇప్పటి వరకు ఈ డి కి ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు..డిపాజిట్ దారులకు పూర్తి వెసులు బాటు కల్పించాలనే 160 బ్యాంకు ఖాతాలు తెరిచామని కోర్టుకు తెలిపారు..డిపాజిటర్లకు చెల్లించే సొమ్మును అకౌంట్ పే ద్వారానే చెల్లిస్తున్నామన్నారు.. ఉద్దేశ పూర్వకంగానే తమ క్లయింట్ పై కేసులునమోదు చేశారన్నారు..డిపాజిట్ దారులకు నష్టం కలుగకుండా చూసేందుకు ఇరవై ఐదు కోట్ల రూపాయలు కోర్టులోనే డిపాజిట్ చేస్తామని తదాని వివరించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదిస్తూ ఇప్పటికే హీరా గ్రూప్ పై దేశాలలో అనేక చోట్ల కేసులు నమోదయ్యాయని నౌహీర షేక్ ను కస్టడీకి ఇవ్వడం ద్వారా మరిన్ని విషయాలు బయటపడతాయని కోర్టుకు తెలిపారు.

ఇండియా మొత్తంలో.....

ఇండియా వైడ్ గా డిపాజిట్ల‌ను క‌ల‌క్ట్ చేసి బిచాణా ఎత్తిసిన హీరా గ్రూప్ ఆఫ్ చైర్మ‌న్ నౌహీరా షేక్ కేసులో స్పీడ్ పెంచారు సీసీఎస్ పోలీసులు.2010 సంవత్సరంలో హీరా గ్రూప్ ను 25 లక్షలతో స్థాపించారు. హీరా గ్రూప్ గడిచిన ఏడు సంవత్సరాల వ్యవధిలోనే 900 కోట్లు చూపించడంతో అనుమానాలు తలెత్తాయి.దేశవ్యాప్తంగా మొత్తం 50 కంప‌ెనీల‌ను ఏర్పాటు చేసుకుని వేల సంఖ్య‌లో హీరా డిపాజిట్ల‌ దారుల దగ్గరి నుండి వ‌సూలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది..గోల్డ్ స్కీమ్ లు అంటూ పెట్టుబ‌డీ పెడితే క‌మీష‌న్ రూపంలో పెద్ద మొత్తంలో డ‌బ్బులు ఇస్తామంటూ అమాయ‌కుల ద‌గ్గ‌ర వేలకు వేల రూపాయ‌ల‌ను హీరా షేక్ దండుకుంద‌ని పోలీసుల విచార‌ణలో తేలింది.అయితే ఇప్ప‌టి వ‌ర‌కు హీరా గ్రూప్ అధినేత పై తెలంగాణ లో రెండు,ఆంధ్రప్రదేశ్ లో రెండు,కర్ణాటకలో 2,బెంగుళూర్ లో రెండు థానా లో రెండు కేసులు నమోదు అయ్యాయని పిపి కోర్టుకు తెలిపారు...ఇప్పటికే ఆంద్రప్రదేశ్ సిఐడి కూడా కేసు నమోదు చేసుకుని హీరా కంపెనీల కు సంభందించి అనేక ఆదారాలు సేకరించిందన్నారు.

చేవెళ్లలోనూ భూములు....

కేవలం డబ్బు సంపాదనపైనే దృష్టి సారించిన నౌహీరా ..హీరా మెడికల్ సిటీ ఏర్పాటు పేరిట 2013 లో చేవెళ్ల సమీపంలో 80 ఎకరాలు కోనుగోలు చేశారు..కానీ అక్కడ ఎలాంటి మెడికల్ కాలేజీ నిర్మాణం చేయకుండా స్థలం పర్యవేక్షణ కు 20 మంది సిబ్బందిని నియమించారు.ఇక హీరా గ్రూప్ కార్యకలాపాల్లో ఆన్ లైన్ లోనే ఎక్కువగా నగదు లావాదేవీలు జమచేసినట్లు పోలీసుల ధర్యాప్తులో వెల్లడైయింది.ఇప్ప‌టికే భార‌త్ తో పాటూ గల్ఫ్ దేశాలలో దాదాపు 160 బ్యాంకు అకౌంట్ల‌ను హీరా క‌లిగి ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు...ఆయా ఖాతాల్లో హీరా గ్రూప్ జరిపిన లావాదేవిల ఏవిధంగా ఉన్నాయి? ఆ ఖాతాలు చూసిన తర్వాత ప్రజల దగ్గరి నుండి ఎంత మెుత్తంలో డబ్బులు వసూలు చేశారన్న దానిపై ఆమెను కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు..పోలీసులు. ప్రాథమికంగా ఆమెతో పాటు కంపెనీల పేరుతో ఉన్న 160 బ్యాంకు ఖాతాలను గుర్తించిచారు. వాటిని ఫ్రీజ్‌ చేసి అధ్యయనానికి సన్నాహాలు చేస్తున్నారు..నౌహీరా షేక్ ను కస్టడీ లోకి తీసుకుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయంటున్నారు పోలీసులు...మరీ రేపటి తీర్పులో కోర్టు కస్టడీకి అనుమతిస్తుందా..బెయిల్ మంజూరు చేస్తుందా అనేదానిపై ఆసక్తి నెలకోంది.

Similar News