తప్పుడు ప్రచారం ఆపండి

కరోనా వైరస్ తెలంగాణలో నివసించే ఏ వ్కక్తికి కరోనా సోకలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనాపై ప్రజల్లో భయాందోళనలను కల్గించడం తగదన్నారు. [more]

Update: 2020-03-04 12:19 GMT

కరోనా వైరస్ తెలంగాణలో నివసించే ఏ వ్కక్తికి కరోనా సోకలేదని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. కరోనాపై ప్రజల్లో భయాందోళనలను కల్గించడం తగదన్నారు. ప్రజలు ఎవ్వరూ ఈ వదంతులను నమ్మవద్దన్నారు. మహేంద్ర హిల్స్ లో కరోనా సోకిన వ్యక్తి కుటుంబ సభ్యులకు కూడా ఈ వ్యాధి సోకలేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ఇద్దరు కరోనా బాధితుల నమూనాలను మాత్రమే సేకరించామని చెప్పారు. మహేంద్ర హిల్స్ లో ముందు జాగ్రత్తగా శానిటేషన్ చర్యలు చేపట్టామని అన్నారు. ఈ వైరస్ గాలి ద్వారా వ్యాప్తి చెందదని ఈటల రాజేందర్ తెలిపారు. సోషల్ మీడియాలో కరోనా వైరస్ పై తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఇది ఆపాలని ఆయన సూచించారు.

Tags:    

Similar News