గల్లీ బాయ్ అరిపించేస్తోంది..!

ఈ గురువారం బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, అలియా భట్ నటించిన గల్లీ బాయ్ రిలీజ్ అయ్యి మంచి టాక్ తో పాటు మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. [more]

Update: 2019-02-16 08:10 GMT

ఈ గురువారం బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్, అలియా భట్ నటించిన గల్లీ బాయ్ రిలీజ్ అయ్యి మంచి టాక్ తో పాటు మంచి వసూళ్లతో దూసుకుపోతుంది. ర్యాప్ మ్యూజిక్ ని స్లమ్ ఏరియా నేపథ్యానికి జోడించిన జోయా అక్తర్ దర్శకత్వ ప్రతిభకు సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అవ్వడంతో వసూళ్లజల్లు కురుస్తుంది. మొదటి రోజు ఈ సినిమా 19 కోట్ల 40 లక్షలు రాబట్టి రణ్వీర్ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ మూవీల్లో రెండో స్థానంలో ఉంది. రెండు నెలలు కిందట రిలీజ్ అయిన టెంపర్ రీమేక్ సింబా 20 కోట్ల 72 లక్షలతో టాప్ లో ఉంటే దాని తరువాత స్థానంలో గల్లీ బాయ్ ఉంది. ఇక మూడో స్థానంలో 19 కోట్లతో పద్మావత్ ఉంది.

వీకెండ్ లో మరిన్ని వసూళ్లు

ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు ఇంకో సినిమా పోటీకి లేకపోవడంతో గల్లీ బాయ్ కు రికార్డులు సులవవుతున్నాయి. ఈ సినిమాలో అలియా భట్ – రణ్వీర్ సింగ్ పెర్ఫార్మన్స్ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. క్రిటిక్స్ పరంగా కూడా ఈ సినిమాకి మంచి రేటింగ్స్ వచ్చాయి. మొదటి రోజే కలెక్షన్స్ ఇలా ఉంటే ఈ వీకెండ్ లో ఎలా ఉంటాయో వేరే చెప్పనవసరం లేదు.

Tags:    

Similar News