జగన్ ప్రమాణస్వీకారానికి అతిథులు వీరే..!

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఎల్లుండి [more]

Update: 2019-05-28 08:42 GMT

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని రీతిలో ఘన విజయం సాధించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. ఎల్లుండి మధ్యాహ్నం 12.30 గంటలకు ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే తన ప్రమాణస్వీకారానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించిన జగన్ ఇవాళ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డీఎంకే అధినేత స్టాలిన్ కు ఫోన్ చేసి ఆహ్వానించారు. చంద్రబాబు ఇంకా హజరవుతారో లేదో క్లారిటీ ఇవ్వలేదు కానీ స్టాలిన్ మాత్రం జగన్ ప్రమాణస్వీకారానికి హాజరుకానున్నారు. ఆయన ఎల్లుండి విజయవాడకు రానున్నారు. కేసీఆర్ సైతం రేపు సాయంత్రానికే విజయవాడ చేరుకుంటారు.

Tags:    

Similar News