కీలక తీర్పు నేడే.....!

Update: 2018-09-04 02:30 GMT

గోకుల్ చాట్,లుంబిని పార్క్ జంట పేలుళ్ళ కేసులో నేడు తుది తీర్పు రానుంది. చర్లపల్లి జైలులో ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం లో న్యాయమూర్తి తీర్పు వెలువరించనున్నారు. ఈ కేసులో ఐదుగురు ఉగ్రవాదులు జైల్లో ఉన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. ఈరోజు న్యాయస్థానం తీర్పు వెలువరించనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

జైల్లో ఉన్న నిందితులు.....

1) సాదిక్ ఇస్రార్.

2) అక్బర్ ఇస్మాయిల్,

3) షఫిక్ సయీద్,

4) ఫరూక్ షర్ఫుద్దీన్

5) తారిక్ అంజుమ్.

ఉరి వేయాలంటూ....

నిందితులకు ఉరిశిక్ష వేయాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి. తీర్పు నేపథ్యంలో చర్లపల్లి జైలు లో మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఆగస్టు 25వ తేదీ 2007లో గోకుల్ ఛాట్, లుంబినీ పార్కుల్లో వరుస బాంబుపేలుళ్లు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘాతుకానికి ఇండియన్ ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థ ఒడిగట్టింది. జంటపేలుళ్లలో 42 మంది మృతి చెందారు. 50 మందికి గాయాలయ్యాయి. పేలుళ్లు జరిగిన రెండేళ్ల తరువాత నిందితులు పట్టుబడ్డారు. దర్యాప్తు బాధ్యతను ఆక్టోపస్ విభాగానికి అప్పగించారు. 1125 పేజీలతో మూడు ఛార్జ్ షీట్ల దాఖలు చేశారు. 286 మంది సాక్షుల నుంచి వాగ్మూలాన్ని సేకరించారు. మరికాసేపట్లో తీర్పు వెలువడనుంది.

Similar News