మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డి కన్నుమూత

మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డి కన్నుమూశారు. ఆయన గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కరోనా బారిన పడిన నాయని నరసింహారెడ్డి తర్వాత [more]

Update: 2020-10-22 01:52 GMT

మాజీ మంత్రి నాయని నరసింహారెడ్డి కన్నుమూశారు. ఆయన గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల కరోనా బారిన పడిన నాయని నరసింహారెడ్డి తర్వాత కోలుకున్నారు. ఆయనకు తర్వాత ఊపిరితిత్తుల సమస్య తలెత్తింది. కొద్దిరోజులుగా అపోలో ఆసుపత్రి వైద్యులు నాయని నరిసింహారెడ్డికి వెంటిలేటర్ పై వైద్య చికిత్స అందిస్తున్నారు. ఆయన నిన్న అర్ధరాత్రి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో నాయని నరసింహారెడ్డి చురుగ్గా పాల్గొన్నారు. ట్రేడ్ యూనియన్ నాయకుడిగా ఆయన రాజకీయంగా ఎదిగారు. ఆయన మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం ప్రకటించారు.

Tags:    

Similar News