ఉండవల్లి కి కరోనా … హోం ఐసొలేషన్ లోనే?

మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ కి కరోనా సోకింది. రెండు రోజులుగా జ్వరం తో బాధపడుతూ ఉండటంతో ఆయన స్వాబ్ టెస్ట్ చేయించుకున్నారు. అందులో [more]

Update: 2020-08-26 13:57 GMT

మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ కుమార్ కి కరోనా సోకింది. రెండు రోజులుగా జ్వరం తో బాధపడుతూ ఉండటంతో ఆయన స్వాబ్ టెస్ట్ చేయించుకున్నారు. అందులో పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో హోమ్ ఐసోలేషన్ లో ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో ఉండిపోయారు. ఆయన భార్య కు టెస్ట్ చేయించగా నెగిటివ్ గా నిర్ధారణ అయ్యింది. కరోనా వచ్చిన నాటినుంచి ప్రజలను చైతన్యం చేయడంలో ప్రసార మాధ్యమాల ద్వారా ఆయన కృషి చేశారు. అలాగే ప్రతి నెల పెట్టే మీడియా మీట్ లను కూడా రద్దు చేసి కరోనా తగ్గాక రాజకీయ విశ్లేషణలు చేస్తానని గత నెల ప్రకటించారు.

జాగ్రత్తలు పాటించినా …

వైరస్ సోకకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు గత ఆరునెలలుగా ఆయన ఇంటి దగ్గరే ఉంటూ అన్ని నియమాలు పాటించినా కరోనా రావడం ఆయన మిత్రులను ఆశ్చర్య పరుస్తుంది. ఉండవల్లి అరుణ కుమార్ కు పాజిటివ్ అన్న వార్త బయటకు రావడంతో వేలమంది ఆయన అభిమానులు ఫోన్ లు మెసేజ్ లు చేస్తూ ఉండటంతో ఆయన ఆందోళన చెందవద్దని కోరుతున్నారు. త్వరలోనే కోలుకుని ప్రజల ముందుకు వస్తానని వైరస్ పట్ల అప్రమత్తంగా ప్రతిఒక్కరు ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొద్ది రోజులు ఫోన్ లు చేయవద్దని సన్నిహితులను కోరుతున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. తూర్పుగోదావరి జిల్లా లో వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్నా రికవరీ రేటు కూడా అధికంగానే ఉంది.

Tags:    

Similar News