ఏపీ ఆర్థిక వ్యవస్థ కుదేలుకు కారణం జగనే

ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కారణమని ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపణలు చేశారు. [more]

Update: 2019-04-23 10:36 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ కారణమని ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపణలు చేశారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను మోడీ అడ్డుకున్నారని, కూలీలకు ఇచ్చే ఉపాధి నిధులు కూడా అడ్డుకున్నారని ఆరోపించారు. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పీఎంఓలో తిష్టవేసి అపోహలు పెంచారని అన్నారు. రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా కేంద్రం ఆర్బీఐని అడ్డుకుందని పేర్కొన్నారు. గత ఐదేళ్లలో ఆశించిన స్థాయిలో పన్ను రాబడులు పెరగలేదని, మూలధన వ్యయం, రెవెన్యూ వ్యయం పెరిగిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ హయాంలో చేసిన అప్పులు కూడా తాము ఇప్పుడు చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. ఈ ఐదేళ్లలో రూ.95,564 కోట్ల అప్పుల భారం పడిందని స్పష్టం చేశారు. 14 ఆర్థిక సంఘం లెక్కల్లో లోపాల వల్ల రాష్ట్రంపై రూ.20 వేల కోట్ల నష్టం జరిగిందన్నరు. ఇక, తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ వృద్ధి రేటు సాధించిందని, అందుకే కేసీఆర్ కు అసూయ అని తెలిపారు.

Tags:    

Similar News