ఫైనల్ జడ్జిమెంట్ నేడే

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. ఇప్పటికే విచారణ ముగియడంతో నిందితుడు సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్ [more]

Update: 2020-02-06 02:59 GMT

తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన హాజీపూర్ వరుస హత్యల కేసులో నేడు తుది తీర్పు వెలువడనుంది. ఇప్పటికే విచారణ ముగియడంతో నిందితుడు సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డికి శిక్ష ఖరారయ్యే అవకాశం ఉంది. ఇటీవలే సమత హత్య కేసులో నిందితులకు ఉరిశిక్ష పడటంతో ఈకేసుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జనవరి 27నే తీర్పు వస్తుందని అనుకునప్నప్పటికీ అనివార్య కారణాల వల్ల కేసును కోర్టు ఈనెల 6వతేదికి వాయిదా వేసింది. దీంతో నేడు వెలువడే తీర్పు కోసం స్ధానికలుంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని హాజిపూర్ గ్రామానికి చెందిన సైకో కిల్లర్ మర్రి శ్రీనివాస్ రెడ్డి లిఫ్ట్ పేరుతో ముగ్గురు మైనర్ బాలికలను బైక్‌పై ఎక్కించుకొని తన వ్యవసాయ బావి వద్దకు తీసుకెళ్లి అత్యాచారం, హత్య చేసి బావిలో పూడ్చిపెట్టాడు. అలా ఇప్పటివరకు శ్రావణి, మనీషా, కల్పన లను చంపి నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గతఏడాది ఏప్రిల్ 28వతేదిన నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురు బాలికల హత్య కేసులనూ దశల వారీగా విచారించిన న్యాయస్థానం ఆకేసులో అన్ని కోణాలనూ పరిశీలించింది. కేసులో ఫోరెన్సిక్ తో పాటు సైంటిఫిక్ ఆధారాలను కూడా సేకరించిన పోలీసులు వాటిని సాక్ష్యాధారాల కింద కోర్టుకు అందచేశారు. మూడు కేసులలో కలిపి మొత్తం 101 మంది సాక్ష్యులను కూడా విచారించిన కోర్టు వారి సాక్ష్యాలను కూడా నమోదు చేసింది.

Tags:    

Similar News