ఓటుకు నోటు కేసులో సుదీర్ఘ విచార‌ణ‌

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ కేసులో ఈడీ అధికారుల ముందు ఇవాళ కాంగ్రెస్ నేత వేం న‌రేందర్ [more]

Update: 2019-02-12 12:04 GMT

తెలుగు రాష్ట్రాల్లో సంచ‌ల‌నం సృష్టించిన ఓటుకు నోటు కేసు మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. ఈ కేసులో ఈడీ అధికారుల ముందు ఇవాళ కాంగ్రెస్ నేత వేం న‌రేందర్ రెడ్డి విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. ఆయ‌న గ‌తంలో తెలుగుదేశం పార్టీ నేత‌గా ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ఆయ‌న టీడీపీ నుంచి పోటీ చేసిన‌ప్పుడే ఓటుకు నోటు కేసు తెర‌పైకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. న‌రేంద‌ర్ రెడ్డిని విచార‌ణ‌కు హాజ‌రుకావాల్సిందిగా ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌తో పాటు ఆయ‌న కుమారుడు కూడా ఈడీ ఎదుట హాజ‌ర‌య్యారు. ఆరు గంట‌లుగా వీరి విచార‌ణ జ‌రుగుతోంది. ఈ కేసులో ఏసీబీకి ప‌ట్టుబ‌డ్డ 50 ల‌క్ష‌ల‌తో పాటు ఎమ్మెల్యే స్టీఫెన్‌స‌న్‌కు ఇస్తామ‌ని చెప్పిన మిగ‌తా రూ.4.5 కోట్ల గురించి ఈడీ ఆరా తీస్తున్న‌ట్లు తెలుస్తోంది. మ‌నీలాండ‌రింగ్‌కు పాల్ప‌డ్డారా అనే కోణంలో ఈడీ విచార‌ణ సాగుతున్న‌ట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News