చార్మినార్ వద్ద డ్రోన్...మహిళపై కేసు

Update: 2018-07-06 12:45 GMT

చార్మినార్ వద్ద నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ ను వినియోగించిన ఓ మహిళపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. సుపర్ణ నాథ్(26) గురువారం అర్థరాత్రి చార్మినార్ సమీపంలో డ్రోన్ ను తిప్పుతోంది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో వారు..డ్రోన్ ను సీజ్ చేసి మహిళను అదుపులోకి తీసుకున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాల సూచనల మేరకు భద్రతాచర్యల్లో భాగంగా హైదరాబాద్ లో డ్రోన్లను వినియోగించడాన్ని నిషేదించారు. యధేచ్ఛగా డ్రోన్లను వినియోగించడం ద్వారా భద్రతాపరమైన ఇబ్బందులు తలెత్తే అవకశం ఉన్నందున డ్రోన్లను వాడవద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే, ఈ ఆదేశాల గురించి తెలియక సదరు మహిళ డ్రోన్ ను వినియోగించిందా లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ధర్యాప్తు చేస్తున్నారు. డ్రోన్ల వినియోగానికి సంబంధించి నిబంధనలను రూపొందించేందుకు ప్రభుత్వం ఇటీవలే ఓ కమిటీని కూడా వేసింది. ప్రభుత్వ సంస్థలు డ్రోన్లు ఉపయోగించాలనుకుంటే ముందుగా స్థానిక పోలీసుల వద్ద అనుమతి పొందాలి.

Similar News