అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టియించిన డాక్టర్ దిశ హత్య కేసు లో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. మరింత లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని [more]

Update: 2019-12-05 08:43 GMT

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టియించిన డాక్టర్ దిశ హత్య కేసు లో దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. మరింత లోతైన దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆధారాల సేకరణ , ఫోరెన్సిక్ , డీఎన్ఏ , లీగల్ ప్రొసీడింగ్స్ కోసం టీమ్స్ ను ఏర్పాటు చేసి త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలని పోలీసులు భావిస్తున్నారు. 50 రోజుల్లో ఛార్జ్ షీట్ వేసి నిందితులకు ఫాస్ట్ ట్రాక్ కోర్టరు ద్వారా కట్టిన శిక్ష పడేలా పోలీసులు దర్యాప్తు కొనసాగనుంది.

ప్రభుత్వం సీరియస్ గా….

దిశ కేసు దేశ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. పార్లమెంట్ ను సైతం కుదిపేసింది. ఓవైపు దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతుంటే.. మరోవైపు ఏ నలుగురు కలిసినా జస్టిస్ ఫర్ దిశ గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియా సాక్షిగా పోలీసులు, ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. రాష్ట్రంతో పాటు జాతీయ రాజకీయ పార్టీలు సైతం దిశ ఘటనపై స్పందించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. కేసు త్వరిత గతిన పూర్తి చేసి నిందితులకు కట్టిన శిక్ష పడేలా చూడాలని ఆదేశించడంతో కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు.

ఏడు బృందాలతో….

దిశ హత్య కేసు లోతైన దర్యాప్తు కోసం ఏడు బృందాలను ఏర్పాటు చేశారు . ఒక్కో బృందం లో ఏడుగురు పోలీసులు ఉంటారు. మొత్తం ప్రత్యేక బృందం లో 50 మంది పోలీసులు ఉంటారు. సీపీ స్థాయి నుండి కానిస్టేబుల్ వరకు ఈ కేసు ను దర్యాప్తు చేయనున్నారు. ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారిగా శంషాబాద్ డీసీపీ ప్రకాష్ రెడ్డి కి భాద్యతలు అప్పగించారు. కేసు మొత్తాన్ని సీపీ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షణ చేయనున్నారు. ఇక 20 మంది ప్రత్యేక బృందం లో నలుగురు అడిషనల్ డీసీపీ లు , ముగ్గురు సీఐ లు , ఇద్దరు ఎసై లు తో పాటు 12 మంది కానిస్టేబుల్ ఉన్నారు. వీరితో పాటు సాక్షాలు సేకరణ, ఫోరెన్సిక్ , డీఎన్ఏ , లీగల్ ప్రొసీడింగ్స్ కోసం మరో బృందాన్ని ఏర్పాటు చేశారు.

బృందాలుగా ఏర్పడి….

అత్యంత పాశవికంగా వ్యవహరించిన నలుగురు నిందితులకు కఠిన శిక్ష పడేలా సత్వర న్యాయం జరిగేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు కు హైకోర్టు సానుకూలంగా స్పందించడం తో నిందితులకు కట్టిన శిక్ష పడేలా చూడాలని పోలీసులు యోచిస్తున్నారు .. కేసులో ఉన్న ప్రధాన సాక్షుల విచారణ , ఐడెంటిఫికేషన్ పరేడ్ కోసం మరో బృందం విచారణ చేయనుంది. ఇక కేసులో సీసీ కెమెరాల వీడియో లు అనాలసిస్ , టెక్నీకల్ ఎవిడెన్స్ అనాలిసిస్ చేయడానికి ఆడిషన్ డీసీపీ స్థాయి అధికారికి భాద్యతలు అప్పగించారు. ఇక ఈ కేసులో కీలంగా ఉన్న సీన్ టు సీన్ అనాలసిస్ తో పాటు క్రైమ్ సీన్ రీ కనస్ట్రక్షన్ చేయడం, ఇప్పటికే షాద్ నగర్ కోర్టు నిందితులను పోలీసుల కష్టడీకి అనుమతించడం తో మరో మారు క్రైమ్ సీన్ రీ కనస్ట్రక్షన్ చేసి అక్కడే నిందితుల స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు. కేసు త్వరితగతిన విచారణ పూర్తి చేసి 50 రోజుల్లో ఛార్జ్ షీట్ వేయాలని పోలీసులు యోచిస్తున్నట్లు సమాచారం.

Tags:    

Similar News