బ్రేకింగ్: డేటా చోరీ గుట్టు రట్టు..!

ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వివరాలను ఐటీ గ్రిడ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా సేకరించిందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఈ కేసుపై బుధవారం ఆయన మీడియాతో [more]

Update: 2019-03-06 11:09 GMT

ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత వివరాలను ఐటీ గ్రిడ్ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా సేకరించిందని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ స్పష్టం చేశారు. ఈ కేసుపై బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ… వ్యక్తిగత వివరాలతో పాటు ఆధార్, ఇతర వివరాలను ఐటీ గ్రిడ్ సంస్థ సేకరించిందన్నారు. ఐటీ గ్రిడ్ సంస్థ రూపొందించిన ‘టీడీపీ సేవామిత్ర’ యాప్, ఫోన్ ద్వారా ప్రజలు ఏ పార్టీకి చెందిన వారో తెలుసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇలా తెలుసుకున్నాక కొందరి పేర్లు ఓటరు జాబితా నుంచి డిలీట్ చేసినట్లు ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న అశోక్ దాకవరపును త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు. ఐసీపీ 420, 490, 467, 468, 471 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ వ్యవహారంలో కోడ్ భాషను ఉపయోగించారని, దాన్ని డీకోడ్ చేస్తామన్నారు. ఈ విషయాన్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తామని, వారి ఆదేశాల ప్రకారం ఈ కేసులో చర్యలు తీసుకుంటామని తెలిపారు. కేసు మూలాలు, ఫిర్యాదుదారుడు హైదరాబాద్ లోనే ఉన్నందున ఇక్కడే కేసు నమోదు చేశామన్నారు.

Tags:    

Similar News