బంతి..బంతికి...కాసుల పంటే...!

Update: 2018-05-08 01:57 GMT

సోషల్ నెట్ వర్క్ లను వేదికగా చేసుకుని కొత్త తరహా క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఓ ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు. 17 మంది ముఠా సభ్యులలో 12 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారి వద్ద నుండి 15 లక్షల రూపాయల నగదును సీజ్ చేయడమే కాకుండా, ఏడు లక్షల రూపాయల బ్యాంక్ డిపాజిట్లు కనుగొన్నారు.పట్టుబడిన ముఠా అంతా గతంలో పాత నేరస్థులేనని సిటీ సిపి అంజనీ కుమార్ వెల్లడించారు.

వాట్సప్ ద్వారా....

వాట్సాప్ సోషల్ మీడియాలో శరవేగంగా దూసుకు పోతున్న నెట్ వర్క్.. ప్రతి మనిషికి అందులో నాలుగైదు సిమ్స్ ఉన్నట్లే.. వాట్సప్ లు కూడా ఉంటున్నాయి. అలాంటి వాట్సాప్ వేదికగా ఓ ముఠా సిటీలో చెలరేగిపోయింది. ఎవరికి అనుమానం రాకుండా క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడి పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది. పట్టుబడిన ముఠాలో అయిదుగురు పరారీలో ఉన్నా ఈ గ్యాంగ్ అసలు సూత్రధారి మాత్రం పట్టుబడ్డాడు. బోయిన్ పల్లికి చెందిన మహేష్ మనియాల్ తన స్నేహితులైన సాయి కుమార్, విజయ్, వినోద్, రాజ్ కుమార్ రాధోడ్, మహేష్ తో కలిసి గతంలో కూడా క్రికెట్ బెట్టింగ్ పాల్పడి పోలీసులకు చిక్కారు. మళ్లీ సిటీలో ఐపిఎల్ మ్యాచ్ రావడం వారికి కాసుల పంటగా మారింది. మహారాష్ట్ర, పూనే, బెంగుళూరు వేదికగా బెట్టింగ్ దందాను కొనసాగిస్తున్నారు. విషయం తెలుసుకొని దాడి చేసిన పోలీసులుకు దిమ్మతిరిగే విషయాలు బయటపడ్డాయి. వాట్సప్ వేదికగా మార్చుకొని పేటియం ద్వారా డబ్బులు పంపుకుంటూ క్రికెట్ బెట్టింగ్ లకు పాల్పడుతున్నట్లు కనుగొన్నారు. నిందితుల నుండి 20 సెల్ ఫోన్లు, 15లక్షల నగదుతో పాటు, బ్యాంకులో డిపాజిట్ చేసిన 7లక్షల రూపాయలు సైతం స్వాధీనం చేసుకున్నారు. ఈజీ మని కోసం జనం ఇలాంటి బెట్టింగ్ రాయుళ్ల వలలో పడవద్దంటున్నారు పోలీసులు.

Similar News