భారత్ లో అక్కడ కరోనా వైరస్ లేదట

కరోనా వైరస్ దేశమంతా వ్యాపించింది. రోజుకు రెండులక్షలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో [more]

Update: 2021-04-17 01:12 GMT

కరోనా వైరస్ దేశమంతా వ్యాపించింది. రోజుకు రెండులక్షలకు పైగానే కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ వంటి రాష్ట్రాల్లో రోజుకు వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం కరోనా తీవ్రత తక్కువగా ఉంది. లడఖ్ , త్రిపుర, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం, లక్షద్వీప్, అరుణాచల్ ప్రదేశ్ , అండమాన్ నికోబార్ ప్రాంతాల్లో కేసులు అతి తక్కువ నమోదవుతున్నాయి. మరణాలు కూడా నమోదు కావడం లేదు. దీంతో ఆ ప్రాంతాలకు వచ్చే వారిపై ప్రభుత్వాలు నిఘా పెట్టాయి.

Tags:    

Similar News