తెలంగాణకు మళ్లీ తగులుకున్నట్లుంది… వరసగా ప్రతి రోజూ?

తెెలంగాణలో కరోనా వైరస్ వదలడం లేదు. వారం రోజుల క్రితం వరకూ తగ్గినట్లే కన్పించిన కరోనా మళ్లీ స్పీడ్ పెంచింది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 42 కరోనా [more]

Update: 2020-05-18 02:13 GMT

తెెలంగాణలో కరోనా వైరస్ వదలడం లేదు. వారం రోజుల క్రితం వరకూ తగ్గినట్లే కన్పించిన కరోనా మళ్లీ స్పీడ్ పెంచింది. నిన్న ఒక్కరోజే తెలంగాణలో 42 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో అత్యధికంగా 37 కేసులు హైదరాబాద్ పరిధిలోనివే. దీంతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1551కు చేరుకున్నట్లయింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులు మొత్తం 57 మందికి కరోనా వైరస్ సోకింది. కేంద్ర ప్రభుత్వం నాలుగో విడత లాక్ డౌన్ లో మరిన్ని మినహాయింపులు ఇవ్వడంతో హైదరాబాద్ లో కరోనా కేసులు మరిన్ని పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగినట్లు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అయితే గత రెండు వారాలుగా తెలంగాణలోని 25 జిల్లాల్లో ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం కొంతలో కొంత నయంగా కన్పిస్తుంది.

Tags:    

Similar News