రేవంత్ పూర్తిగా ఇరుక్కున్నట్లేనా?

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి భూ స్కామ్ కూరుకుపోయారు. రేవంత్ సోదరుల భూదందాలు ఒక్కొక్కటిగా రెవెన్యూ అధికారుల విచారణలో వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ భూములు, చెరువులు చివరకు [more]

Update: 2020-03-02 01:43 GMT

కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి భూ స్కామ్ కూరుకుపోయారు. రేవంత్ సోదరుల భూదందాలు ఒక్కొక్కటిగా రెవెన్యూ అధికారుల విచారణలో వెలుగు చూస్తున్నాయి. ప్రభుత్వ భూములు, చెరువులు చివరకు రోడ్లతో పాటు ప్రయివేటు భూములను సయితం రేవంత్ సోదరులు ఆక్రమించుకున్నారని రెవెన్యూ విచారణలో తేలింది. గోపన్న పల్లి లోని సర్వే నెంబరు 34లో ఎకరా 11 కుంటల భూమిని రేవంత్ సోదరులు ఆక్రమించారన్న ఆరోపణలున్నాయి. అలాగే కోమటికుంటలోని సర్వే నెంబరు 126 లో ఎఫ్.టి.ఎల్ బఫర్ జోన్ లోనూ ఎకరా 14 కుంటలు రేవంత్ సోదరులు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారని రెవెన్యూ శాఖ విచారణలో స్పష్టమయింది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, వాల్టా చట్టం, తెలంగాణ రెవెన్యూ యాక్ట్ ప్రకారం రేవంత్ సోదరులు నిబంధనలను ఉల్లంఘించారని తేలింది. దీంతో రేవంత్ సోదరులపై క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిసింది. స్థానికుల ఫిర్యాదు మేరకు రేవంత్ భూ ఆక్రమణలపై రెవెన్యూ శాఖ విచారణ జరుపుతోంది.

Tags:    

Similar News