కాంగ్రెస్ ను పక్కన పెడతారా..?

Update: 2018-09-10 14:14 GMT

తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ముఖ్యంగా పొత్తుల రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. కేసీఆర్ ను ఎదుర్కునేందుకు మహాకూటమి ఏర్పాటు తప్పదని కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ భావించాయి. గతాన్ని మర్చి పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించాయి. వీరితో పాటు తెలంగాణ జన సమితి, సీపీఐ పార్టీలను కలుపుకుని మహాకూటమిగా ఏర్పడి టీఆర్ఎస్ ను గద్దె దించాలని నిర్ణయించాయి. అయితే, సీట్ల పంపిణీ మహాకూటమి ఏర్పాటుకు ఆటంకంగా మారే అవకాశం కనపడుతోంది.

కాంగ్రెస్ లేకుండానే చర్చలు..!

సోమవారం సాయంత్రం తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు ఎల్.రమణ, సీపీఐ అధ్యక్షుడు చాడ వెంకట్ రెడ్డి రహస్యంగా సమావేశమయ్యారని తెలుస్తోంది. ముఖ్యంగా వీరు పొత్తులపై చర్చిస్తున్నారు. కోదండరాం కోరిక మేరకే సమావేశమయ్యారని తెలుస్తోంది. అయితే, 40 సీట్లు అడగాలని టీజేఎస్, 35 సీట్లు అడగాలని టీటీడీపీ భావిస్తున్నందున కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీలకు అన్ని స్థానాలు కేటాయించే అవకాశం లేదు. ఇక, కాంగ్రెస్ నేతలు లేకుండా రహస్య సమావేశం కావడం బట్టి చూస్తే కాంగ్రెస్ లేకుండానే కూటమి ఏర్పాటు దిశగా ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా..? అనే అనుమానం రాజకీయావర్గాల్లో వ్యక్తమవుతోంది.

Similar News