బ్రేకింగ్: ముఖ్యమంత్రి రాజీనామా

Update: 2018-06-19 09:56 GMT

జమ్మూ కశ్మీర్ లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. పీడీపీ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నట్లు బీజేపీ ప్రకటించింది.ఈ మేరకు గవర్నర్ కు ఉపసంహరణ లేఖ కూడా పంపించారు. దీంతో జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో మహబూబా ముఫ్తీనే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ కు పంపించారు. దీంతో జమ్మూ కశ్మీర్ లో గవర్నర్ పాలన అనివార్యమైంది. వాస్తవానికి కశ్మీర్ ఎన్నికల్లో ఏ పార్టీకీ సంపూర్ణ మెజారిటీ రాకున్నా, సైద్ధాంతిక భేదాలున్న బీజేపీ సంచలన నిర్ణయం తీసుకుని పీడీపీతో కలిసి ప్రభుత్వంలో భాగమైంది.

Similar News