ముందే ముగిసిన కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ కంటే ముందే ముగిసింది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై చ‌ర్చించేందుకు గానూ కేసీఆర్ కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ముందు కేర‌ళ‌కు [more]

Update: 2019-05-10 11:51 GMT

ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప‌ర్య‌ట‌న షెడ్యూల్ కంటే ముందే ముగిసింది. ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పై చ‌ర్చించేందుకు గానూ కేసీఆర్ కేర‌ళ‌, త‌మిళ‌నాడు రాష్ట్రాల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. ముందు కేర‌ళ‌కు వెళ్లి అక్క‌డి ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌యన్ ను క‌లిసిన కేసీఆర్ ఈ మేర‌కు చ‌ర్చించారు. త‌ర్వాత కేర‌ళ‌లోని పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శించిన ఆయ‌న అనంత‌రం త‌మిళ‌నాడుకు వెళ్లారు. షెడ్యూల్ ప్ర‌కారం ఈ నెల 13వ తేదీన డీఎంకే అధినేత స్టాలిన్ ను కేసీఆర్ క‌ల‌వాల్సి ఉంది. అదే రోజు ఆయ‌న ప‌ర్య‌ట‌న ముగించుకొని హైద‌రాబాద్ కి తిరిగి రావాలి. కానీ, స్టాలిన్ ఉప ఎన్నిక‌ల బిజీలో ఉండ‌టంతో కేసీఆర్ తో భేటీని ర‌ద్దు చేసుకున్నారు. దీంతో త‌మిళ‌నాడులోనూ ప‌లు పుణ్య‌క్షేత్రాల‌ను సంద‌ర్శించిన కేసీఆర్ ఇవాళ రాత్రి తిరిగి బ‌య‌లు దేరి హైద‌రాబాద్ చేరుకోనున్నారు. స్థానిక సంస్థ‌ల ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు ఆయ‌న అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేయ‌నున్నారు.

Tags:    

Similar News