అధికారులను ఎలా బదిలీ చేస్తారు..?

ఐపీఎస్ అదికారులను ఈసీ బదిలీ చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫైరవుతున్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆర్థిక నేరస్తుడు విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఐపీఎస్ అధికారులను ఎలా [more]

Update: 2019-03-27 06:39 GMT

ఐపీఎస్ అదికారులను ఈసీ బదిలీ చేయడంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫైరవుతున్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఆర్థిక నేరస్తుడు విజయసాయిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఐపీఎస్ అధికారులను ఎలా బదిలీ చేస్తారని ప్రశ్నించారు. ఏ కారణం లేకుండా అధికారులను బదిలీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. బీజేపీ, కేసీఆర్ తో కలిసి వైసీపీ ఆడిన నాటకాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయని అన్నారు. ఐపీఎస్ అధికారులను ఏ కారణంతో బదిలీ చేశారో కారణం చెప్పలేకపోతున్నారని ఆయన ఆరోపించారు.

Tags:    

Similar News